
అందరూ నా పెళ్లి రద్దు గురించి అడుగుతున్నారు.. నిజానికి నా పేరెంట్స్ నా పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఓ సంబంధం తీసుకురాగానే సరేనని తలాడించాను. కానీ పెళ్లంటే చిన్న విషయం కాదు.
సీరియల్స్‌లో విలనిజం పండించే పాత్రలకు పెట్టింది పేరు రెనీ ధ్యాని. రాత్రి కి యాత్రి, కసమ్, చంద్రఖాంత, యే తేరి గాలియాన్, ఆప్‌కీ నజ్రోన్ నే సమ్‌జా.. ఇలా ఎన్నో సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. నటనకు కొంత గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. 'నటిగా భిన్న పాత్రల్లో యాక్ట్ చేస్తూ రావడం వల్ల కొంత అలసటకు లోనయ్యాను. మళ్లీ ఈ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి బ్రేక్ అవసరమని భావించాను. నెగెటివ్ రోల్స్ చేయడం వల్ల నాపై పడిన ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తీసేయాలనుకున్నాను. నా మనసును, మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నాను. అందుకే 9 నెలల బ్రేక్ తీసుకున్నాను.
ఈ బ్రేక్ నాకు చాలా ఉపయోగపడింది
పైగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నాను. అందులో భాగంగానే వివిధ తీర్థయాత్రలకు వెళ్లాను. గత కొన్నేళ్లుగా నాతో దూరంగా ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి కాలక్షేపం చేసి ఎన్నో మధురమైన అనుభవాలు మూటగట్టుకున్నాను. ఈ అనుభవాలు తిరిగి నేను మూలాలతో కనెక్ట్ అయ్యేందుకు దోహదపడ్డాయి. నన్ను నేను తిరిగి చూసుకున్నాను. ఇప్పుడు నేను నా భావోద్వేగాలను, కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలను. అందరూ నా పెళ్లి రద్దు గురించి అడుగుతున్నారు.. నిజానికి నా పేరెంట్స్ నా పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఓ సంబంధం తీసుకురాగానే సరేనని తలాడించాను. కానీ పెళ్లంటే చిన్న విషయం కాదు.
అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు
ఎన్నో బరువుబాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అసలే చాలా పెళ్లిళ్లు మధ్యలోనే విచ్ఛిన్నమవుతాయి. నాకొక తోడు కావాలన్న ఆలోచన కూడా లేని సమయంలో ఆదరాబాదరాగా పెళ్లి చేసుకోవడం అవసరమా? అనిపించింది. ఇప్పుడే వెళ్లి వద్దు అని నాన్నకు చెప్పేశా. ఆయన అర్థం చేసుకున్నాడు. నా నిర్ణయాన్ని గౌరవించాడు. అలా పెళ్లి రద్దు చేసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా రెనీ గతేడాది జూలై 3న ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సత్య వర్మతో పెళ్లికి సిద్ధమైంది. కానీ అంతలోనే పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తెలిపింది.