TV Actress Somya Seth Finds Happiness In Second Marriage With Shubham Chuhadia - Sakshi
Sakshi News home page

Somya Seth: మా పెళ్లి కోసం నా కొడుకు ఎంతో ఎదురుచూశాడు..

Published Mon, Jun 26 2023 5:00 PM | Last Updated on Mon, Jun 26 2023 5:47 PM

TV Actress Somya Seth Finds Happiness In Second Marriage With Shubham Chuhadia - Sakshi

పెళ్లి, విడాకులు, సింగిల్‌ పేరెంట్‌గా ఇబ్బందులు.. ఇలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సీరియల్‌ నటి సౌమ్య ఇటీవలే కొత్త జీవితాన్ని ఆరంభించింది. ప్రియుడు శుభం చౌహడియాను అమెరికాలో సీక్రెట్‌గా పెళ్లాడింది. తాజాగా తన రెండో పెళ్లి గురించి స్పందించింది నటి సౌమ్య సేత్‌. ఆమె మాట్లాడుతూ.. 'నా భవిష్యత్తు బాగుండాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్‌ ఆరాటపడ్డారు. వారి కోరికను నిజం చేస్తూ పెళ్లిపీటలెక్కాను.

నా కొడుకు ఐడెన్‌ కూడా శుభంను ఎంతో ఇష్టపడుతున్నాడు. వాళ్లిద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. మా పెళ్లి కోసం వాడు కూడా ఎదురుచూశాడు. పెళ్లి గెటప్స్‌లో మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డాడు' అని చెప్పుకొచ్చింది. జూన్‌ 21న హల్దీ, మెహందీ వేడుక జరగ్గా 22వ తేదీన వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

ఎవరీ శుభం చౌహడియా?
చిత్తూర్‌ఘడ్‌కు చెందిన ప్రముఖ హాస్పిటల్‌ వైద్యుడు అంజు చౌహాన్‌ తనయుడే శుభం. ఇతడు వాషింగ్టన్‌ డీసీలో ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నాడు. గత ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్న సౌమ్య తన అపార్ట్‌మెంట్‌లో ఓ గదిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకోగా అదే గదిలో శుభం వచ్చి చేరాడు. మొదట హౌస్‌మేట్‌గా, తర్వాత ‍స్నేహితుడిగా మారాడు. కరోనా సమయంలో ఒకరికొకరు సాయంగా ఉంటూ మరింత దగ్గరయ్యారు. అతడు తన జీవితంలోకి వస్తే లైఫ్‌ మరింత అందంగా తయారవుతుందని భావించింది సౌమ్య. ఇద్దరూ ప్రేమించుకోగా వారి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా పచ్చజెండా ఊపాయి.

చదవండి: టూమచ్‌ ఓవరాక్షన్‌ అని నటుడిని పొట్టుపొట్టు తిట్టిన డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement