
చిన్న వయసులోనే బిగ్‌బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది సుంబుల్ టొఖీర్. 19 ఏళ్లకే హిందీ బిగ్‌బాస్ 16వ సీజన్‌లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించిందీ నటి. ఇమ్లీ, ఇషారోన్ ఇషారోన్ మే, చంద్రగుప్త మౌర్య సహా పలు సీరియల్స్‌లో నటించిన ఆమె ఆర్టికల్ 15 సినిమాలోనూ యాక్ట్ చేసింది.
తాజాగా ఈ బుల్లితెర నటి ముంబై నగరంలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. 'ఇది మా కొత్తిల్లు.. ఇంకా పనులు జరుగుతున్నాయి. కొన్ని ఐడియాలు చెప్పొచ్చుగా' అంటూ ఇన్‌స్టాగ్రామ్ వీడియో షేర్ చేసింది. తన కొత్తింటికి ఎలాంటి ఇంటీరియర్ అయితే బాగుంటుందో సూచనలు, సలహాలు ఇవ్వమని కోరింది. ప్రస్తుతానికి ఆ ఫ్లాట్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే సుంబుల్ చేతిలో డియర్ ఇష్క్ వెబ్ సిరీస్ ఉంది. రవీందర్ సింగ్ రాసిన 'రైట్ మి ఎ లవ్ స్టోరీ' పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment