
అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది దెబీనా బొనర్జీ. తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినా పెద్ద గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. హిందీ రామాయణం సీరియల్‌లో సీతగా ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. ఇదే సీరియల్‌లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరిని 2006లో రహస్యంగా, 2011లో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లాడింది. వీరికి గతేడాది ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది.
'నాక్కూడా ఫిట్‌గా ఉండాలనుంది. అందుకే మీరు చెప్పేకంటే ముందే నేను వ్యాయామాన్ని మొదలుపెట్టాను. అందుకు నా శరీరం కూడా సహకరిస్తోంది. అలా అని అందరు తల్లులు ఎక్సర్‌సైజ్ చేయాల్సిందేనని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. అయినప్పటికీ నేను బరువు తగ్గలేకపోతున్నాను. దీని గురించి సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. దీనివల్ల నాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
కానీ నేను అమ్మతనాన్ని హాయిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. డైట్ విషయంలో మాత్రం నేను నిబంధనలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే నేను పాలిచ్చే తల్లిని. తిండి దగ్గర నోటికి సంకెళ్లు వేస్తే నా పిల్లలకు సరిపడా పాలు రావు. కాబట్టి ఇప్పుడు నేను నా పిల్లల గురించి మాత్రమే ఆలోచించాలనుకుంటున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా బరువు తగ్గుతాను. నా గురించి పనికిమాలినది వాగేవాళ్లను పట్టించుకోను. వాళ్ల కోసం అనవసరంగా ఆలోచించి నా పిల్లలకు పాలివ్వడం మానేసి సన్నబడలేను' అని చెప్పుకొచ్చింది దెబీనా.
చదవండి: ఆస్పత్రి నుంచి ఉపాసన డిశ్చార్జ్.. తన పోలికలేనన్న రామ్‌చరణ్
Comments
Please login to add a commentAdd a comment