Shruti Shanmuga Priya's Husband Death Post Goes Viral - Sakshi
Sakshi News home page

Sruthi Shanmuga Priya: పుట్టెడు శోకంలో ఉన్నాం.. మాపై మీరు చేస్తుంది అన్యాయం

Published Sat, Aug 5 2023 9:58 AM | Last Updated on Sat, Aug 5 2023 10:59 AM

Sruthi Shanmuga Priya Talking About Her Husband Death - Sakshi

కోలీవుడ్‌లో పాపులర్ బుల్లితెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా  ఆగష్టు 2న మరణించాడు. ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

(ఇదీ చదవండి: వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్‌)

శ్రుతి షణ్ముక ప్రియ నాదస్వరం, భారతి కణ్ణమ్మ, వాణిరాణి, పూనూంజల్ లాంటి తమిళ సీరియల్స్‌తో  బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది. గతేడాది ఆరవింద్‌ను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది. భర్త మరణంతో పుట్టెడు శోకంలో ఉన్నా కూడా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె ఒక విజ్ఞప్తి చేశారు.

అరవింద్‌ మృతితో దుఃఖంలో  ఉన్న తనను ఓదార్చేందుకు ఫోన్‌లు, మెసేజ్‌లు పంపిన వారందరికి  ధన్యవాదాలు తెలుపుతూ ఇలా చెప్పుకొచ్చారు. 'అరవింద్ నాతోనే ఉంటాడు, ఎప్పుడూ మాతోనే ఉంటాడు.  ఇలాంటి సమయంలో కూడా ఈ వీడియోను ఎందుకు పోస్ట్ చేస్తున్నానో మొదట మీకు చెప్తాను. అరవింద్‌ మరణానికి సంబంధించి అసలు ఏం జరిగిందో తెలియని వారు దీనిని సమాచారంగా కూడా తీసుకోవచ్చు. కానీ కొంతమంది యూట్యూబర్‌లకు నిజం ఏమిటో తెలియదు వాళ్లందరూ రకరకాల పుకార్లను ప్రచారం చేస్తున్నారు.

(ఇదీ  చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్‌)

అతనొక సివిల్ ఇంజనీర్, ఫ్యాషన్ కోసం బాడీబిల్డర్ కూడా. ఆయన గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా తెలిపారు.  కానీ యూట్యూబర్‌లు మాత్రం పలు రకాలైన థంబ్‌నైల్స్‌ పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అతని మరణానికి కారణం అసలు విషయం తెలిసికూడా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తప్పుగా ప్రచురించడం న్యాయం కాదు. ఇంట్లో అందరం పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.  మీ వ్యూవ్‌స్‌, లైకుల కోసం మమ్మల్ని వేధించకండి.' అని  శ్రుతి షణ్ముగ ప్రియ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement