TV Actress Sruthi Shanmuga Priya Husband Dies Tragically One Year After Marriage - Sakshi
Sakshi News home page

Sruthi Shanmuga Priya: బుల్లితెర నటి ఇంట తీవ్ర విషాదం.. పెళ్లయిన ఏడాదికే

Published Thu, Aug 3 2023 6:14 PM | Last Updated on Thu, Aug 3 2023 7:13 PM

TV Actress Sruthi Shanmuga Priya Husband Dies Tragically One Year After Marriage - Sakshi

తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగప్రియ జీవితంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త అరవింద్‌ శేఖర్‌(30) ఆగస్టు 2న గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆమె ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా శృతి, అరవింద్‌ శేఖర్‌  కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. గతేడాది మే నెలలో ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. పెళ్లయిన ఏడాదికే భర్త చనిపోవడంతో శృతి గుండెలవిసేలా రోదిస్తోంది.

కాగా శృతి.. నటస్వరం సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. వాణి రాణి, కల్యాణ పరిసు, పొన్నుచల్‌, భారతీ కన్నమ్మ వంటి పలు హిట్‌ ధారావాహికల్లో నటించింది. సీరియల్స్‌ చేస్తున్న సమయంలో బాడీ బిల్డర్‌ అరవింద్‌ శేఖర్‌తో లవ్‌లో పడ్డ ఈమె అతడితో కలిసి రీల్స్‌ చేస్తూ ఉండేది. వీరిని అభిమానులు ముచ్చటైన జంటగా అభివర్ణించేవారు. ఇంత చిన్న వయసులో అరవింద్‌ మరణించడంతో అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

చదవండి: బేబీకి అదిరిపోయే ఆఫర్‌.. ఆ యంగ్‌ హీరోతో జోడీ కట్టనున్న వైష్ణవి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement