
... అంటున్నారు నటి కస్తూరి. కస్తూరి అంటే వెంటనే గుర్తుకొచ్చేస్తారు. ‘అన్నమయ్య’ సినిమాలో ‘ఏలే ఏలే మరదలా..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేశారు. ఈ మధ్య ‘శమంతకమణి’లో సుధీర్‌బాబు తల్లిగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన ‘తమిళ పడమ్ 2.0’ సినిమా టీజర్‌లో గ్లామరస్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు కస్తూరి.
‘‘ఒక రెస్పాన్సిబుల్ మదర్‌గా ఉంటూ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం కరెక్ట్ కాదు’’ అంటూ విమర్శకు గురయ్యారామె. దీనికి కస్తూరి స్పందిస్తూ – ‘‘ఈ ఆలోచనా ధోరణే మార్చుకోవాలంటున్నాను. సెక్సీగా కనపడటం అంటే నీతి నియమాలకు దూరంగా ఉండటం, అమ్మతనానికి కళంకం తేవడం అనే ఆలోచనా ధోరణి మారాలి. ‘మీరు డ్రింక్ చేసే సీన్స్‌లో, రొమాంటిక్ సీన్స్‌లో యాక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు పిల్లలున్నారు’ అని మేల్ ఆర్టిస్ట్‌లకు చెప్పం కదా. మరి ఆడవాళ్లకే ఎందుకీ నియమాలు. ఆర్టిస్ట్ అంటే ఎవరైనా ఒకటే కదా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment