Change mindset
-
మార్పు మనుగడ కోసమే...
జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తాం... వాటిని ఏ కోణంలో చూస్తామనే విషయం మీదే మన అభివృద్ధి, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.. మనసు బాగోలేనపుడు చాలా విషయాలను మనం సమస్యలుగా చూస్తాం.. ప్రశాంతంగా ఉన్నపుడు అవే పరిస్థితులను సవాళ్లుగా భావిస్తాం. అందువల్ల మన అభివృద్ధి ఏదైనా అది మనం ఆయా సమస్యలను స్వీకరించే స్థితి మీదే ఆధార పడి ఉంటుంది..మనిషి జీవితం పూల పాన్పు కాదు.. అదేవిధంగా ముళ్ళ కిరీటం కూడా కాదు.. ఈప్రాథమిక సూత్రాన్ని అవలోకనం చేసుకుని మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించినపుడే మన జన్మకు సార్ధకత లభిస్తుంది.. బతుకూ పండుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు వెరుస్తూ, మార్పును ఆహ్వానించకపోతే అది మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది. ఒక పనిలో విఫలమైనపుడు దానిలో ఎందుకు విఫలమయ్యామా... అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు పాడు చేసుకునే కన్నా, ఏం జరిగినా అది మన మంచికోసమేనని ఆత్మను సంతృప్తి చేసుకుంటే మనసు కుదుట పడుతుంది. ఆనందం సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే మార్పును ఎప్పటికప్పుడు ఆహ్వానించి, దానిని మన జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి తప్ప, ఆత్మన్యూనతతో కుంగి పోకూడదు.కనుక మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా సంఘపరంగా, ఆత్మపరంగా ఇంకా అనేకానేక కోణాలలో, అనేకానేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి... అనివార్యం గా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పునూ మనం అంగీకరించాలి.కురుక్షేత్ర సంగ్రామంలో తాను అస్త్ర సన్యాసం చేస్తానని అర్జునుడు చింతించినపుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. మార్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, ఇది çసృష్టి ధర్మమని, మార్పును అంగీకరించినపుడే భవిష్యత్ నిర్దేశం కలుగుతుందని బోధించాడు. అలా శ్రీ కృష్ణభగవానుడి స్ఫూర్తితో అర్జునుడు యుద్ధం చేసి ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాడు.ప్రతి ఒక్కరూ మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మనతో మనం పోటీ పడాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుంది. కనుక మొదట్నుంచీ తల్లిదండ్రులు మార్పుకు అనుగుణంగా జీవితాలను మలచుకోవాలనే దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వర్తమాన ప్రపంచానికి, పరిస్థితులకనుగుణంగా వారికి వారు నైపుణ్యాలు పెంచుకునే విధంగా ్రపోత్సహించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఇవ్వాలి అలాగే, వారి వ్యక్తిత్వాలు, ్రపాధాన్యతలు, పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. కుటుంబాలు, పాఠశాలలు పిల్లల సామర్థ్యం, ఉత్సుకత, సృజనాత్మకత, అలవాట్లను పిల్లల భావి జీవితానికనుగుణంగా తీర్చిదిద్దినపుడు జీవితంలో వస్తున్న మార్పులను అంగీకరించే సామర్థ్యాన్ని ΄÷ంది, పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారన్న వాస్తవాన్ని గుర్తించి మసలుకోవాలి. దాసరి దుర్గాప్రసాద్ -
జీవితమే పాఠం.. ఎవరేమన్నా లైట్ తీస్కో! నువ్వేంటో నీకే తెలుసు
-
మనస్తత్వాలు మారాలి
... అంటున్నారు నటి కస్తూరి. కస్తూరి అంటే వెంటనే గుర్తుకొచ్చేస్తారు. ‘అన్నమయ్య’ సినిమాలో ‘ఏలే ఏలే మరదలా..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేశారు. ఈ మధ్య ‘శమంతకమణి’లో సుధీర్‌బాబు తల్లిగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన ‘తమిళ పడమ్ 2.0’ సినిమా టీజర్లో గ్లామరస్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు కస్తూరి. ‘‘ఒక రెస్పాన్సిబుల్ మదర్‌గా ఉంటూ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం కరెక్ట్ కాదు’’ అంటూ విమర్శకు గురయ్యారామె. దీనికి కస్తూరి స్పందిస్తూ – ‘‘ఈ ఆలోచనా ధోరణే మార్చుకోవాలంటున్నాను. సెక్సీగా కనపడటం అంటే నీతి నియమాలకు దూరంగా ఉండటం, అమ్మతనానికి కళంకం తేవడం అనే ఆలోచనా ధోరణి మారాలి. ‘మీరు డ్రింక్ చేసే సీన్స్‌లో, రొమాంటిక్ సీన్స్‌లో యాక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు పిల్లలున్నారు’ అని మేల్ ఆర్టిస్ట్‌లకు చెప్పం కదా. మరి ఆడవాళ్లకే ఎందుకీ నియమాలు. ఆర్టిస్ట్ అంటే ఎవరైనా ఒకటే కదా’’ అన్నారు. -
పెద్దనోట్ల రద్దుపై రిలయన్స్ అధినేత అంబానీ..
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆ శుభవార్త ను అధికారికంగా వెల్లడించారు. సంచలన జియో ఆఫర్ ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ జియో ఖాతాదారులకు బంపర్ఆఫర్ ఇచ్చారు. గురువారం జరిగిన వాటాదారుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దుపై తొలిసారి స్పందించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ పట్ల హర్షం ప్రకటించారు. ఇందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన రిలయన్స్ అధినేత ప్రధాని నిర్ణయం చాలా విశాలమైందనీ కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనివలన సామాన్య ప్రజలు లబ్ది పొందుతారనీ,మార్పుకు సాయపడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు నగదు రహిత లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. డిజిటల్ సేవలు ఆర్థిక వృద్ధికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. లావాదేవీల్లో అపూర్వమైన పారదర్శక, జవాబుదారీతనం తీసుకురావడం దీనికి దోహదపడుతుందన్నారు. 'హ్యాపీ న్యూయర్ ప్లాన్' పేరుతో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంల ద్వారా వేగంగా జియో మనీ సేవల్ని వేగంగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు జియో కస్టమర్లకు ఇతర టెలికాం నెట్ వర్క్ లు సహకరించడం లేదని ఆరోపించారు. ఆయన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు: 2017 మార్చి 31 వరకూ డేటా, వాయిస్ కాల్స్ అన్నీ ఫ్రీ ఆధార్ ఆధారంగా 5 నిమిషాల్లో జియో సిమ్ యాక్టివేషన్ కాల్ డ్రాప్ సమస్యల 90 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. హ్యాపీ న్యూయర్ ప్లాన్‌తో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ ప్రతి రోజూ 1 జిబి వరకూ ఉచితంగా వాడుకోవచ్చు 2016 డిసెంబర్ 4 నుంచి 2017 మార్చి 31 వరకూ ఫ్రీ కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లకి వర్తించే జియో ఆఫర్ జియో మనీతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ -
విద్యతో ఆలోచనల్లో మార్పు
విద్యతోనే మనుషుల ఆలోచనా విధానంలో మార్పు సంభవమని నటి కిరణ్ ఖేర్ అన్నారు. ఆమె గురువారం పంచాయత్ ఆజ్ తక్ నిర్వహించిన ‘ఓట్ లో.. సురక్షా దో..’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలను నిరోధించాలంటే ముందు స్త్రీ,పురుషుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచాలన్నారు. చదువుకున్న వారి ఆలోచనలు సరైన రీతిలో ఉంటాయి. అదే విపరీత మానసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తుల మెదడు సక్రమ మార్గంలో ఆలోచించలేదు.. అలాంటి వారిని విద్యావంతులను చేస్తే సరైన మార్గంలో నడిచే అవకాశముంది..’ అని ఆమె సూచించారు. ‘భారతదేశం చాలా సువిశాలమైంది.. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రేమికుల రోజును జరుపుకోవడాన్ని స్వాగతిస్తారు.. కొన్ని ప్రాంతాల్లో తప్పుగా చూస్తారు.. అది ఆయా ప్రాంతాల ప్రజల ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది.. విద్యతో అటువంటి వారి ఆలోచనాసరళిని మార్చవచ్చు’నని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై హింసను అరికట్టాలంటే చట్టాలను చాలా కఠినంగా అమలు చేయాలని, దానికి చాలా బలమైన నాయకత్వం అవసరమని బీజేపీ నేత అయిన ఈ 58 ఏళ్ల బాలీవుడ్ సినీనటి స్పష్టం చేశారు.