రజనీ తప్ప వేరే విషయాలు లేవా?: నటి ప్రశ్న | In Tamil Nadu we discuss other things than Rajinikanth, says actress | Sakshi
Sakshi News home page

రజనీ తప్ప వేరే విషయాలు లేవా?: నటి ప్రశ్న

Published Wed, Jun 28 2017 10:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

రజనీ తప్ప వేరే విషయాలు లేవా?: నటి ప్రశ్న

రజనీ తప్ప వేరే విషయాలు లేవా?: నటి ప్రశ్న

చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నదని, అయినా ఆ విషయాలేవీ పట్టించుకోకుండా కేవలం రజనీకాంత్‌ రాజకీయ ఆగమనం మీద జాతీయ మీడియా ఫోకస్‌ చేయడం దారుణమని ప్రముఖ తమిళ నటి కస్తూరి విమర్శించారు. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై ఆమె గతంలో వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మీడియా తీరును తప్పుబట్టారు. ‘రజనీకాంతే కాదు తమిళనాడులో చర్చించుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి.  గత డిసెంబర్‌ నుంచి రాష్ట్రంలో శూన్యత ఆవరించి ఉంది. ఓ మంచి వ్యక్తి వచ్చి ఈ శూన్యాన్ని భర్తీ చేయాలి. అయితే, ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అంటూ అస్తమానం ఊహాగానాలు చేయడం సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు.

కస్తూరి ఇటీవల రజనీకాంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వల్ల ఆయన రాజకీయ అభిప్రాయాలు తెలుసుకొనే వీలు కలిగిందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ విషయమై స్పందిస్తూ త్వరలోనే మార్పు దిశగా రజనీ అడుగులు వేసే అవకాశముందని చెప్పారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ రజనీ తన అభిమానుల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రజనీ రాజకీయ ఆగమనం ఖాయమని వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement