అవగాహన కోసం అర్ధనగ్నంగా ... | kasturi in publicity on cancer | Sakshi
Sakshi News home page

అవగాహన కోసం అర్ధనగ్నంగా ...

Published Sun, Nov 1 2015 8:15 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

అవగాహన కోసం అర్ధనగ్నంగా ... - Sakshi

అవగాహన కోసం అర్ధనగ్నంగా ...

చెన్నై : సినిమాను దాటి నటి కస్తూరి అర్ధనగ్నంగా ఒక చంటి బిడ్డను గుండెలకు హత్తుకున్నట్లు కెమెరాకు పోజులిచ్చారు. అవి ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. నటి కస్తూరి దక్షిణాది చిత్రపరిశ్రమలో సుపరిచితురాలే. తమిళంలో ఆత్తా ఉన్‌కోయిలిలే చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసి చిన్నవర్, సెంతమిళ్‌పాట్టు తదితర చిత్రాల్లో నటించారు.

కార్తీక్, ప్రభు, ప్రశాంత్ తదితర నటులకు జంటగా నటించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ అన్నమయ్య వంటి పలు చిత్రాల్లో నటించారు. వివాహానంతరం నటనకు దూరంగా ఉన్న కస్తూరి ఆ మధ్య నాంగ చిత్రం ద్వారా రీఎంట్రీ అయ్యారు. అయితే రీఎంట్రీ ఆమెను కథానాయికగా నిలబెట్టలేక పోయింది. కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు.
 
 తాజాగా ఒక పుస్తకానికి అర్ధనగ్న పోజు లిచ్చి వార్తల్లోకెక్కారు. అమెరికాకు చెందిన జెడ్ అనే నిశ్చల ఛాయాగ్రహకుడు గర్భిణి స్త్రీల సమస్యలు, ప్రసవం అనంతరం గురయ్యే సుఖ వ్యాధులు క్యాన్సర్, గర్భసంచి సమస్యలు ఇత్యాది విషయాలపై అవగాహన కలిగించేలా ఏ బ్యూటీపుల్ ప్రాజెక్ట్ అనే పుస్తకాన్ని ప్రచురించనున్నారు.

ఈ పుస్తకం కోసం కస్తూరి అర్ధ నగ్న పోజులిచ్చారట.దీని గురించి ఆమె తెలుపుతూ మం చి ప్రయత్నం కోసం తన ఇమేజ్ బాధింపుకు గురవతుందన్న అంశాన్ని కూడా పక్కన పెట్టి అర్ధనగ్న పోజులిచ్చానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వెలువడనున్న ఈ పుస్తకం లో కస్తూరిలా మరో 80 మంది స్త్రీల ఈ తరహా పోజులతో కూడిన ఫోటోలు ఆ పుస్తకంలో చోటు చేసుకుంటాయట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement