
4 సెక్షన్ల కింద కేసు నమోదు
తమిళసినిమా: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసే విషయమై న్యాయ నిపుణులతో పోలీసులు చర్చిస్తున్నారు. ఇండియా తెలుగు సమ్మేళనం తరఫున కసూ్తరిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై 192, 196(1ఏ)3 53 ,353(2) సెక్షన్‌ల కింద కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆమెను పోలీస్ కార్యాలయానికి రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతో నటి కస్తూరి అరెస్ట్ అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కస్తూరి ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, తన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను గాయపరిచినట్లయితే వారికి క్షమాపణ చెబుతున్నానని ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment