రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | one people died in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jan 21 2014 1:41 AM | Updated on Aug 30 2018 3:56 PM

కొత్తపేట మండలం పలి వెల వంతెన సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అమలాపురం శ్రీరామపురానికి

 కొత్తపేట, న్యూస్‌లైన్ : కొత్తపేట మండలం పలి వెల వంతెన సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అమలాపురం శ్రీరామపురానికి చెందిన ఎం డూరి నాగవెంకట సుబ్బారావు తన భార్య రామతులసి,మూడేళ్ల పాపతో కలసి టీవీఎస్ మోపెడ్‌పై అమలాపురం వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆర్‌అండ్‌బీ గైడ్ స్టోన్‌ను ఢీకొన్నాడు. సుబ్బారావు (31) తలకు తీవ్రగాయమై పడిపో యాడు. అతడి భార్య తులసి స్పృహ తప్పి పడిపోయనట్టు భావించి, కొత్తపేటలోని తమ బంధువులకు ఫోన్ చేసింది. వారు సంఘటనస్థలానికి చేరుకుని తులసిని కొత్తపేట పంపించారు. సుబ్బారావును ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏఎస్సై ఎ.గరగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారావు హోల్‌సేల్ మెడికల్ వ్యాపారి. పండగకు తణుకు అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement