అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు
అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు
Published Sat, Oct 8 2016 11:15 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
సూర్యాపేట : నూతన జిల్లాలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేస్తున్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆరోపించారు. పసునూరు గ్రామాన్ని నాగారంలో కలపొద్దని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న గ్రామ సర్పంచ్ లింగయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులను శుక్రవారం రాత్రి అక్కడి పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి చేరుకొని గ్రామ సర్పంచ్‌లతో పాటు కాంగ్రెస్ నాయకులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసునూరు గ్రామాన్ని తుంగతుర్తి మండలంలోనే ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న పసునూరు గ్రామాన్ని తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగారంలో ఎలా కలుపుతారన్నారు. నాగారంలో కలిపితే ప్రజలు అసౌకర్యానికి గురవుతారని తెలిపారు. అలాగే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్లేట్‌లెట్ యంత్రం ఎందుకు పని చేయడం లేదని సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15రోజుల్లో ప్లేట్‌లెట్ యంత్రం పని చేయకపోతే ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చెవిటి వెంకన్న యాదవ్, చకిలం రాజేశ్వర్‌రావు, బైరు వెంకన్నగౌడ్, షాహినాబేగం, చెంచల శ్రీనివాస్, అయూబ్‌ఖాన్, గుడిపాటి నర్సయ్య, రాంబాబు, అంజద్‌అలీ, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
Advertisement