సూర్యాపేట జిల్లాలో కలపాలి
మిర్యాలగూడ
మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలోనే కలపాలని గిరిజన రిజర్వేషన్ సాధన పోరాట సమితి జిల్లా చైర్మన్ బాణావత్ రతన్‌సింగ్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పాటయ్యే సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడను కలపడం వలన నియోజకవర్గంలోని అన్ని గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న మిర్యాలగూడ నాటి నుంచి నేటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయిందన్నారు. కొత్త జిల్లాలో చేరిస్తే అధిక నిధులతో పాటు అధిక అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన 12శాతం హామీని అమలు చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో నీటి సంఘం చైర్మన్ ధీరావత్ మంగ్యానాయక్, మాజీ ఎంపీటీసీ ఇస్లావత్ రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ నాయకులు వారణాసి వెంకటేశ్వర్లు, కూచీమళ్ల ఆనంద్, డకనానాయక్, కమిల్యా తదితరులున్నారు.