consistency
-
రిస్క్ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాలో స్థిరత్వం లోపించిందని.. అందుకే అతను జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడంటూ పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. ఒక యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో భట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభంలోనే రిస్క్ తీసుకొని షాట్లు ఆడుతున్నాడు. ఇది అంత మంచిది కాదు. దీనివల్ల రానున్న టీ20 ప్రపంచకప్‌కు పృథ్వీ ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. టీ20 అంటేనే దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలనేది ప్రథమం. కానీ పృథ్వీ షా ఆరంభంలోనే రిస్క్ షాట్లు ఎక్కువగా ఆడుతున్నాడు. దీనివల్ల తొందరగా వికెట్ కోల్పోయే అవకాశం ఉంది. ప్రతీసారి దూకుడుగా ఆడడం కూడా కరెక్ట్ కాదు. ఆడిన ప్రతీ బంతిని బౌండరీ బాదాలనుకోవడం అతనిలో స్థిరత్వం లేదని చూపిస్తుంది. ఏ జట్టైనా టీ20లో తొలి ఆరు ఓవర్లుగా చెప్పుకొనే పవర్ ప్లేలో స్థిరంగా ఆడే బ్యాట్స్‌మెన్ కావాలి. టీమిండియాకు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు పృథ్వీ షా వారి పక్కన స్థానం సంపాదించాలంటే ముందు స్థిరత్వం చూపించాలి. టీ20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలకు ఇది చాలా కీలకం. షా తన పద్దతి మార్చుకోకుండా ఇలాగే ఆడితే మాత్రం అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కడం కష్టమే'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పృథ్వీ షా ఐపీఎల్ 14వ సీజన్లో మాత్రం దుమ్మురేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అంతకముందు దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం! పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు -
స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు చర్యలు
కాగజ్‌నగర్: సిర్పూర్ నియోజకవర్గంలో నిర్వహించే శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని 256 పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు, సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక, అతి సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించ డం, పోలింగ్ స్టేషన్ల్లో వెబ్ కాస్టింగ్ చేయానికి చర్యలు తీసుకుంటున్నారు. కాగజ్‌నగర్ మండలంలోని భట్టుపల్లిలో పింక్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు అందరూ మహిళలే ఉంటారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ఎన్నికల అధికారులు చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక కేంద్రాలు.. సమస్యల కేంద్రాలు సిర్పూర్ నియోజకవర్గంలోని 40 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించగా, బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో రెండు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పెంచికలపేట్ మండలంలోని మోర్లి గూడ గ్రామంతోపాటు గొండి, రేగులగూడ, మారేపల్లి, మెట్పల్లి, కోసిని, కమ్మర్గాం, అంబగట్టు, అచ్చేల్లి, చింతకుంట, గిరివెళ్లి, మొట్లగూడ తది తర గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని అధి కారులు గుర్తించారు. మొర్లిగూడ గ్రామానికి కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గుట్టలు ఎక్కిదిగాల్సి వస్తుంది. నిధుల మంజూరు కోసం సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ ఓటర్లు.. నియోజకవర్గంలోని 146 గ్రామ పంచాయతీలు ఉండగా 256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నూతన ఓటరు జాబితా వివరాల ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 187387 ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 94786, మహిళలు 92570, ఇతరులు 31 మంది ఉన్నారు. ఇందులో 3243 మంది దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలంలోని కేస్లాపూర్, గుడిపేట, చిన్నతిమ్మాపూర్, పెద్ద తిమ్మాపూర్, కన్నెపల్లి మండలాల్లోని సాలిగాం, ఐతపూర్ గ్రామాల్లో 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగకపోవడంతో పాత నియోజకవర్గంలోనే ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో అత్యల్పంగా 152 ఓటర్లు ఉన్న కేంద్రం చిత్తమా (చింతలమానేపల్లి మండలం) కాగా, అత్యధికంగా 1384 ఓటర్లు ఉన్న కేంద్రం కాగజ్‌నగర్ పట్టణంలోని బాలభారతి పోలింగ్ కేంద్రం నిలిచింది. పట్టణంలోని బాలవిద్యమందిర్ కేంద్రంలో అత్యధిక 731 మంది మహిల ఓటర్లు, చింతలమానేపల్లి మండలంలోని చిత్తామాలో అత్యల్ప 75 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో అత్యధిక 669 మంది పురుష ఓటర్లు ఉండగా, చిత్తామాలో 175 మంది అత్యల్పంగా పురుష ఓటర్లుగా నమోదయ్యారు. వెబ్ కాస్టింగ్‌కు చర్యలు.. కాగజ్‌నగర్ పట్టణంలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వివిధ మాండలాల్లో 212 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3జీ, 4జీ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ కోసం ఎంపిక చేశారు. 98 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణ కోసం 1129 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాల వివరాలు.. నియోజకవర్గంలో మొత్తం 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలో 44, గ్రామాల్లో 47, సిర్పూర్ మండలంలో 29, కౌటాల మండలంలో 29, చింతలమానేపల్లి మండలంలో 29, బెజ్జూర్ మండలంలో 25, పెంచికలపేట్ మండలంలో 16, దహెగాం మండలంలో 31, భీమిని మండలంలో 4, కన్నెపల్లి మండలంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను 29 రూట్లుగా విభజించారు. ఇందులో 30 బస్సు, 16 మినీ బస్సులు, 16 టాటా ఏసీ వాహనాలు, 2 బులేరో, 2 ట్రాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. సిర్పూర్ నియోజకవర్గం పకడ్బందీ నిర్వహణ... సిర్పూర్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలు నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. సమస్యాత్మక కేంద్రాలతోపాటు అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. నియోజకవర్గంలో 6 రోడ్లు నిర్మించడానికి పంచాయతీరాజ్ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఓటింగ్రోజు 98 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించడానికి సిబ్బందిని నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి, మరుగుదొడ్లు, వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునే చర్యలు చేపడుతున్నాం. -జి.శివకుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి, (కాగజ్‌నగర్ ఆర్డీవో) -
సూర్యాపేట జిల్లాలో కలపాలి
మిర్యాలగూడ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలోనే కలపాలని గిరిజన రిజర్వేషన్ సాధన పోరాట సమితి జిల్లా చైర్మన్ బాణావత్ రతన్‌సింగ్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పాటయ్యే సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడను కలపడం వలన నియోజకవర్గంలోని అన్ని గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న మిర్యాలగూడ నాటి నుంచి నేటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయిందన్నారు. కొత్త జిల్లాలో చేరిస్తే అధిక నిధులతో పాటు అధిక అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన 12శాతం హామీని అమలు చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో నీటి సంఘం చైర్మన్ ధీరావత్ మంగ్యానాయక్, మాజీ ఎంపీటీసీ ఇస్లావత్ రెడ్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు వారణాసి వెంకటేశ్వర్లు, కూచీమళ్ల ఆనంద్, డకనానాయక్, కమిల్యా తదితరులున్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
నూతనకల్ తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని మద్దిరాల, వెంకెపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, మినరల్ వాటర్‌ట్యాంకు, బోరు, మోటార్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి, వాటిని పరిష్కరించడం కోసం త్వరలోనే పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తన దత్తత గ్రామమైన మద్దిరాలలో వీధిలైట్లు, సీసీ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.58కోట్లు, రోడ్డు భవనాల శాఖ నుంచి రూ.140వేల కోట్లతో రహదారులు అభివృద్ధి పర్చామని తెలియజేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను నింపడం కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశానని వారం పది రోజుల్లో నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపుతామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ముకుందాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్సింగ్ కొమరయ్య ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ఏ. రజాక్, సర్పంచ్ రాంపాక మంజులసైదులు, ఎంపీటీసీ గూడ అన్నమ్మశివలింగారెడ్డి, బెజ్జంకి శ్రీరాంరెడ్డి, తొనుకునూరి అశోక్‌గౌడ్, కందాల దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి విద్యాసాగర్‌రావు, భూరెడ్డి సంజీవరెడ్డి, నలమాస రాములు, ఆకుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. -
చివర్లో చేతులెత్తేశారు