నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
నూతనకల్
తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని మద్దిరాల, వెంకెపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, మినరల్ వాటర్‌ట్యాంకు, బోరు, మోటార్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి, వాటిని పరిష్కరించడం కోసం త్వరలోనే పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తన దత్తత గ్రామమైన మద్దిరాలలో వీధిలైట్లు, సీసీ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.58కోట్లు, రోడ్డు భవనాల శాఖ నుంచి రూ.140వేల కోట్లతో రహదారులు అభివృద్ధి పర్చామని తెలియజేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను నింపడం కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశానని వారం పది రోజుల్లో నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపుతామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ముకుందాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్సింగ్ కొమరయ్య ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్‌ఏ. రజాక్, సర్పంచ్ రాంపాక మంజులసైదులు, ఎంపీటీసీ గూడ అన్నమ్మశివలింగారెడ్డి, బెజ్జంకి శ్రీరాంరెడ్డి, తొనుకునూరి అశోక్‌గౌడ్, కందాల దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి విద్యాసాగర్‌రావు, భూరెడ్డి సంజీవరెడ్డి, నలమాస రాములు, ఆకుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.