విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ
Published Sat, Sep 10 2016 9:55 PM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
సూర్యాపేట : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ అన్నారు. శనివారం పట్టణంలోని న్యూవిజన్ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలన్నారు. ప్రతి సంవత్సరం మల్లు పెదరామకృష్ణారెడ్డి మెమోరియల్ అవార్డ్సు అందించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మల్లు సుకవీర్‌రెడ్డి, ప్రిన్సిపల్ నవనీత, డాక్టర్ కె.కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement