చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : ప్రస్తుత సమాజంలో చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి హాస్టల్ అధ్యక్షుడు డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి అన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ : ప్రస్తుత సమాజంలో చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి హాస్టల్ అధ్యక్షుడు డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి స్మారక 24వ జిల్లాస్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఏదేని క్రీడను ఎంచుకొని అందులో రాణించాలని సూచించారు. క్రీడల్లో రాణించి నియోజకవర్గానికి, గ్రామానికి, కళాశాలలకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. వ్యక్తిగత ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి స్మారక క్రీడోత్సవాల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పోరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి, పీఈటీలు వెంకటేశ్వర్లు, ఐతగాని శ్రీనివాస్‌గౌడ్, తంగెళ్ల సురేందర్‌రెడ్డి, లింగాల రవిగౌడ్, విక్రంరెడ్డి, రాంబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.