సూర్యాపేట: సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములుకు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేటలోని హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలనుఆయన తనయుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి నిర్వహించారు. అంతకుముందు సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, రాష్ట నేతలు ఎల్.రమణ, బి.వెంకట్ తదితరులు ఆయన పార్థివదేహంపై పార్టీ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో పాటు పలువురు నివాళులర్పించారు. తన జీవితాన్ని పేద ప్రజల కోసం ధారపోసి కమ్యూనిస్టు యోధుడిగా మిగిలారని.. నమ్మిన సిద్ధాం తం కోసం ఏనాడూ రాజీపడని వ్యక్తి బుచ్చిరాములు అని వారు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment