సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి
సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి
Published Sat, Oct 8 2016 10:48 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
సూర్యాపేట
ప్రపంచానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారన్నారు. రంగురంగుల పూలలాగా రాష్ట్రంలోని ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా ప్రతి పండుగను కూడా ఐక్యంగా ఉండి జరుపుకోవాలన్నారు. సూర్యాపేటలో ఎప్పుడైనా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని..ఈసారి అంతకంటే ఘనంగా జరుపుకున్నామన్నారు. మరో మూడు రోజుల్లో సూర్యాపేట జిల్లాగా మారనుందని తెలిపారు. ఎనిమిది రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు బతుకమ్మలను పేర్చుకొని వచ్చి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ప్రతిరోజు బతుకమ్మ ఆడేందుకు వచ్చిన వారికి ఇద్దరిని ఎంపిక చేశారు. వారికి మంత్రి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. టీఎస్‌యుటీఎఫ్‌కు ప్రథమ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాష్‌రెడ్డి, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, డీఎస్పీ సునితామోహన్, తహసీల్దార్ మహమూద్‌అలీ, వైస్ చైర్‌పర్సన్ నేరెళ్ల లక్ష్మి, నాయకులు గండూరి ప్రకాష్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆకుల లవకుశ, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, మండాది గోవర్ధన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement