పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
Published Fri, Sep 9 2016 11:13 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
సూర్యాపేట :
పేదలకు అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లేట్‌లెట్ యంత్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించేలా నిధులు రప్పించి సమకూరుస్తానని తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో ప్లేట్‌లెట్ యంత్రంతో చుట్టు పక్కల ప్రజలకు ఎంతో మేలు కలుగనుందన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోతుందని పేర్కొన్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలు, కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఉండేందుకు గాను నాణ్యమైన వైద్యం అందించి సీఎం ఆలోచనలకు అనుగుణంగా వైద్యులు పని చేయాలని సూచించారు. ప్లేట్‌లెట్ యంత్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, సూర్యాపేట రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మీలా సత్యనారాయణ, వైస్ చైర్‌పర్సన్ ఇరిగి కోటేశ్వరి, కౌన్సిలర్ బైరు దుర్గయ్యగౌడ్, డాక్టర్ సంపత్‌కుమార్, నాయకులు కట్కూరి గన్నారెడ్డి, వై.వి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, ఆకుల లవకుశ, డాక్టర్ వనజ, షేక్ తాహేర్‌పాషా, టైసన్ శ్రీను, కోడి సైదులు యాదవ్, పల్స వెంకన్న, పిడమర్తి శంకర్, బండారు రాజా తదితరులు పాల్గొన్నారు.
Advertisement