మంత్రి ఇంటి ఎదుట రెండో ఏఎన్‌ఎంల ధర్నా | ANM protests infornt of the minister's house | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటి ఎదుట రెండో ఏఎన్‌ఎంల ధర్నా

Published Sat, Aug 20 2016 6:38 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

మంత్రి ఇంటి ఎదుట రెండో ఏఎన్‌ఎంల ధర్నా - Sakshi

మంత్రి ఇంటి ఎదుట రెండో ఏఎన్‌ఎంల ధర్నా

సూర్యాపేట : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రెండో ఏఎన్‌ఎంలు శనివారం సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొలిశెట్టి యాదగిరిరావు, గురూజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరిలో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచి జీఓ 14ను విడుదల చేసినప్పటికీ అందులో రెండో ఏఎన్‌ఎంలను గుర్తించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 4 వేల మంది సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పదో పీఆర్సీ ప్రకారం.. నెలకు రూ.21,300 వేతనం పెంచి, ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి పీఎస్‌ డీఎస్వీ శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు రమాదేవి, కల్యాని, యశోద, సువర్ణ, దేవేంద్ర, స్వప్న, రజియాబేగం, కవిత, కమల, భారతి, రజిత తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement