Published
Fri, Sep 2 2016 11:32 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి భవనాల పరిశీలన
సూర్యాపేట : నూతనంగా జిల్లా కాబోతున్న సూర్యాపేటలో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం(డీఎంహెచ్‌ఓ) ఏర్పాటుకు శుక్రవారం డీఎంహెచ్‌ఓ భానుప్రసాద్ నాయక్ పట్టణంలో పలు భవనాలను పరిశీలించారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భాగంలోని క్వార్టర్స్‌ను, పాత ఆర్డీఓ కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఈ భవనాల ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపనున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్, ఎస్‌పీహెచ్‌ఓ తండు మురళీమోహన్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రమేష్‌నాయక్, మాండన్ సుదర్శన్, తీగల నర్సింహ, భాస్కరరాజు, సల్వాది శ్రీనివాస్, పోతరాజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.