ట్రాన్స్‌కో డీఈకి ఘన సన్మానం | Transco official honor Mudiraj community leaders | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో డీఈకి ఘన సన్మానం

Published Sun, Jul 17 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

ట్రాన్స్‌కో డీఈకి ఘన సన్మానం

ట్రాన్స్‌కో డీఈకి ఘన సన్మానం

సూర్యాపేటటౌన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అవార్డు తీసుకున్న ట్రాన్స్‌ కో డీఈ ఎ.శ్రీనివాసులును సూర్యాపేట పట్టణ ముదిరాజ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పబ్లిక్‌ క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ 25ఏళ్ల నుంచి డిపార్ట్‌మెంట్‌లో చేసిన కృషి ఫలితమే తనకు ఈ అవార్డు లభించిందన్నారు. అలాగే సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పరబోయిన స్వామి ముదిరాజ్, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆకుల లవకుశలు హాజరై మాట్లాడారు. పతాని నర్సయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ వెలుగు సంతోషి, నారబోయిన విజయ్, నక్క రవి, నక్క రాంభానేష్, సారగండ్ల రాములు, అర్వపల్లి లింగయ్య, మాణిక్యమ్మ, వెలుగు వెంకన్న, చందనబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement