సూర్యాపేట ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
సూర్యాపేట ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
Published Sun, Sep 18 2016 7:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
సూర్యాపేట : సూర్యాపేట డిపోలోని కంప్యూటర్స్ విభాగాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఐటీ) ఎ.పురుషోత్తం ఆదివారం తనిఖీ చేశారు. కంప్యూటర్స్ డిపోలో ఉన్న టిమ్ మిషన్ల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆర్టీసీలో రూ. 30 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ సిస్టం ప్రాజెక్టును ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సిస్టం ద్వారా తెలంగాణలోని అన్ని డిపోల్లో పని తీరును, లాభనష్టాల విషయాలను సులువుగా తెలుసుకోవచ్చన్నారు. సూర్యాపేట డిపోలో పని తీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. డిపోలో ఓటీ పేమెంట్, డ్యూటీ చేసిన సిబ్బందికి హాజరు పడడం లేదని ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. టెక్నికల్‌గా కొద్దిగా సమస్య ఉందని, దానిని వెంటనే పరిష్కరించి సిబ్బంది జీతాలు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎఫ్ సక్రం, డీసీ యాదయ్య, స్టేషన్ మేనేజర్లు లింగానాయక్, ముత్తయ్య, సిస్టం సూపర్‌వైజర్ సిమ్లారాణి, వేణు, టీఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి శ్రీనివాస్, యూనియన్ నాయకులు ఎన్‌సీ సైదులు, జిఎన్ రావు, దేవసాయం, చెరుకు వెంకటయ్య, ఎన్.వీరయ్య, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement