పైలేరియా నివారణకు కృషి చే యాలి
సూర్యాపేటటౌన్ : పైలేరియా వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. మంగళవారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో డీఈసీ ఆల్బండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన పైలేరియా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ఈ మాత్రలు రెండు సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణులు, దర్ఘీకాలిక వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నేరేళ్ల లక్ష్మి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, సీనియర్ సబ్లిక్ హెల్త్ అధికారి డాక్టర్ తండు మురళీమోహన్, డాక్టర్ ఎల్.రమేష్‌నాయక్, సబ్ యూనిట్ అధికారులు సముద్రాల సూరి, తీగల నర్సింహ, గవ్వా శ్రీధర్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, వెంకన్న, ఉపేందర్, నర్సింహ, ఉప్పల్‌రెడ్డి, ఇ.లోకేందర్, సబిత, నాగమణి, ఏకస్వామి, పద్మమ్మ, భిక్షం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.