Published
Wed, Aug 17 2016 6:49 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేట : ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన lమాట్లాడుతూ రెండు సంవత్సరాలలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్రీనివాసరావు, సృజన, భట్టు శివాజీ, బొమ్మగాని శ్రీనివాస్, పుట్టపాక శ్రీనివాస్, కోటయ్య, సిరపంగి నాగరాజు, కొండల్, లతీఫ్, రాంరెడ్డి, అంతయ్య, దోరెపల్లి శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.