Published
Thu, Aug 25 2016 10:35 PM
| Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
వినియోగదారుల మన్ననలు పొందాలి
సూర్యాపేట : మన్నిక గల వాహనాలను వినియోగదారులకు అందించి వారి మన్ననలు పొందాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి వెంట నూతనంగా నిర్మించిన వెంకటలక్ష్మి హీరో షోరూం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాహనదారుల మన్ననలు పొందినప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో నడుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, వైస్‌చైర్ పర్సన్ నేరెళ్ల లక్ష్మి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వట్టె జానయ్య యాదవ్, వంశీ, గండూరి ప్రకాష్, ఎంవీఐ కొండయ్య, హీరో కంపెనీ అధికారులు స్వామినాథన్, కరంచందాని, కిరణ్‌కుమార్, హీరో డీలర్ రాచర్ల కమలాకర్, మొరిశెట్టి శ్రీనివాస్, నాగిరెడ్డి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వర్లు, చల్లా లక్ష్మికాంత్, చల్లా లక్ష్మిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.