Published
Sun, Sep 4 2016 9:04 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
సూర్యాపేట : శాంతిభద్రలలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉచిత బంకమట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంప్రదాయాలకు, పండుగలకు పెద్దపీఠ వేస్తోందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ) కెమికల్స్ విగ్రహాలతో కాలుష్యం ఏర్పడి మానవాళి మనుగడకు ముప్పు కలిగే ప్రమాదముందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి కాలుష్య నివారణకు కృషి చేయాలన్నారు. మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడంలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, డీఎస్పీ సునితామోహన్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నేరెళ్ల లక్ష్మి, కమిషనర్ వడ్డె సురేందర్, తహసీల్దార్ మహమూద్ అలీ, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, కక్కిరేణి నాగయ్యగౌడ్, కౌన్సిలర్లు వర్ధెల్లి శ్రీహరి, ఆకుల లవకుశ, నిమ్మల వెంకన్న, తాహేర్‌పాషా, రంగినేని ఉమా, డాక్టర్ వనజ, నర్సింహ, పోలెబోయిన రాధిక, నేరేళ్ల మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.