గీతకార్మికుల సంక్షేమానికి ఎక్సైజ్ శాఖ కృషి
గీతకార్మికుల సంక్షేమానికి ఎక్సైజ్ శాఖ కృషి
Published Fri, Jul 22 2016 5:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
సూర్యాపేటరూరల్ : గీతకార్మికుల సంక్షేమానికి ఎక్సైజ్‌శాఖ నిరంతరం కృషి చేస్తుందని సూర్యాపేట ఎక్సైజ్ సీఐ శ్రీధర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంతో పాటు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గతంలో గాయపడిన గీతకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను బాధిత కుటీంబికులకు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతకార్మికులు వృత్తిరీత్యా తాటిచెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలైన వారికి, మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసిందన్నారు. ఈ సందర్బంగా మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన రాములు ఇటీవల మృతి చెందగా ఆయన భార్య వీరమ్మకు రెండు లక్షల చెక్కును, గాయాలపాలైన పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం గ్రామానికి చెందిన పుట్టా భిక్షంకు రూ.10వేలు, పొట్లపహాడ్‌కు చెందిన రామచంద్రుకు రూ.10వేలు, సూర్యాపేటకు చెందిన రాఘవులుకు రూ.50వేలు, అక్కలదేవిగూడేనికి చెందిన గురుస్వామికి రూ.10వేలు, కూడలికి చెందిన వెంకన్నకు రూ.50వేలు, నెమ్మికల్లుకు చెందిన బెల్లంకొండ రాములకు రూ.50వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్‌ఐ సాజిత్‌ఆహ్మద్, సిబ్బంది బాలాజీ, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement