సాక్షి, సూర్యాపేట: ఓటర్లకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం హుజుర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలు సందర్భంగా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందని..13 చెక్‌పోస్ట్‌ల్లో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలానికి స్పెషల్ స్ట్రికింగ్ ఫోర్స్, ఎంసీసీ బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించారు.
ఎన్నికల కోడ్, పోలీసు యాక్ట్ అమలులో ఉందని.. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఐదు పారా మిలిటరీ బృందాలను రప్పిస్తున్నామన్నారు. 36 ప్రాంతాల్లో 76 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని..21 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి 650 మంది పోలీసు సిబ్బంది విధులకు హాజరవుతారని చెప్పారు. ఏడు ఎస్‌ఎస్‌టీ, నాలుగు వీడియో బృందాలు ఏర్పాటు చేసామని.. ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి నిఘా పెట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment