Published
Fri, Sep 16 2016 7:59 PM
| Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
సూర్యాపేట : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. తిరంగాయాత్రలో భాగంగా శుక్రవారం పట్టణంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాటి రజాకార్ల వారసులుగా ఉన్న ఎంఐఎంకు భయపడి హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి వెనుకంజ వేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీలను విస్మరించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎండి.హబీద్, నాయకులు నలగుంట్ల అయోధ్య, కొణతం సత్యనారాయణరెడ్డి, రంగినేని ఉమాలక్ష్మణ్‌రావు, చల్లమల్ల నర్సింహ, రంగరాజు రుక్మారావు, జటంగి వెంకటేశ్వర్లు, బండపల్లి పాండురంగాచారి, అనంతుల యాదగిరి, వల్దాస్ ఉపేందర్, వీరేంద్ర, జీడి భిక్షం, ఫణినాయుడు, నరేందర్‌రెడ్డి, కత్తి వెంకన్న, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.