జోనల్‌ విధానం రద్దు సరైన చర్య కాదు | zonal system cancel is not correct | Sakshi
Sakshi News home page

జోనల్‌ విధానం రద్దు సరైన చర్య కాదు

Published Sun, Aug 21 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

జోనల్‌ విధానం రద్దు సరైన చర్య కాదు

జోనల్‌ విధానం రద్దు సరైన చర్య కాదు

సూర్యాపేటటౌన్‌ :  సరైన అవగాహన లేకుండా అత్యంత ప్రాధాన్యత గల జోనల్‌ విధానాన్ని రద్దు చేయడం సరైన చర్య కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం(ఎస్‌టీయూటీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్‌టీయూ భవన్‌లో జరిగిన సంఘం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ తెలంగాణలో పది జిల్లాలు ఒకే రకంగా అభివృద్ధి చెందలేవని, దీంతో జోనల్‌ వ్యవస్థను రద్దు చేయడం వల్ల అన్ని జిల్లాలు సమానం కావడంతో వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకకు నెట్టబడే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయులకు సర్వీస్‌రూల్స్‌ అమలుకై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.యతిపతిరావు, కె.వీరరాఘవులు, కె.చంద్రమౌళి, మధు, బొలిశెట్టి వెంకటేశ్వర్లు, సత్తయ్యగౌడ్, జలంద్రాచారి, గోపాలరావు, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement