సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో చెట్టు, కరెంట్‌పోల్ పడిపోయాయి. అయితే ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. Rains lash Telangana
#Hyderabadrains!!
— Telangana state Weatherman (@ts_weather) July 20, 2023
Get ready hyderabad city for some intense spell of rains rains wrst north zone of city for next 1 hour☔ pic.twitter.com/HeQgACIrys
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌లో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి.
కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి.
మెదక్ వెల్దుర్తిలో 15 సెం.మీలు, దామరంచలో 13 సెం.మీ. రాజపల్లిలో 12 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.
యాదాద్రి భువనగిరి రాజాపేట మండలం పరిధిలో ఏకంగా 17 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
నిలిచిపోయిన రాకపోకలు
జయశంకర్ భూపాలపల్లి సహా భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో 16వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వెలుతుర్లపల్లి వద్ద ఉధృతంగా మొరంచవాగు ప్రవహిస్తోంది. ధర్మారావుపేట, అప్పయ్యపల్లి, కొండాపురం, గనపురంల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద తాత్కాలిక మట్టిరోడ్డు తెగిపోయింది. దీంతో పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్ వెంకటాపురంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
గోదావరికి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో.. భద్రాచలం వద్ద 39 అడుగులకు చేరింది నీరు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment