వెండితెరకు యామిని కృష్ణమూర్తి జీవితం | Divyamani Movie Audio Launch | Sakshi
Sakshi News home page

వెండితెరకు యామిని కృష్ణమూర్తి జీవితం

Published Mon, Jan 22 2018 1:47 AM | Last Updated on Mon, Jan 22 2018 1:47 AM

Divyamani Movie Audio Launch - Sakshi

సురేష్‌ కమల్, అరుణా చింత, యామినీ కృష్ణమూర్తి, సాయికుమార్, బలభద్రపాత్రుని రమణి, గిరధర్‌ గోపాల్‌

ప్రముఖ యోగా గురువు, మార్షల్‌ ఆర్టిస్ట్‌ సురేష్‌ కమల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దివ్య మణి’. వైశాలి, కిమయా కథానాయికలు. మోహ్‌ మాయా ఎంటర్‌టైన్మెంట్స్, రెడ్‌ నోడ్‌ మీడియా పతాకంపై గిరిధర్‌ గోపాల్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. గిరిధర్‌ గోపాల్‌–స్టీవ్‌ శ్రీధర్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. లెజెండరీ డ్యాన్సర్, పద్మశ్రీ, పద్మ విభూషణ్‌ అవార్డ్‌ల గ్రహీత డా. యామిని కృష్ణమూర్తి పాటల సీడీలను విడుదల చేసారు. సురేష్‌ కమల్‌ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ఇది నా తొలి చిత్రం. యోగా నేర్పటం కోసం నేను ప్రపంచమంతా తిరిగినా తెలుగు నేలంటే చాలా ఇష్టం.

గిరిధర్‌ గారు మంచి కథ చెప్పారు. ఈ చిత్రంలో డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశా. ఈ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘మనిషి తనని తాను జాగృతి పరచుకోవటానికి సృజనాత్మకత ఎంతో అవసరం. పాటలు బాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా తర్వాత యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్‌ తీస్తాం’’ అన్నారు గిరిధర్‌ గోపాల్‌. ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్, నటుడు సాయికుమార్, మాటల రచయిత బలభద్రపాత్రుని రమణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్‌ కాటా, నేపథ్య సంగీతం: స్టీవ్‌ శ్రీధర్, సునీల్‌ కశ్యప్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement