Kimaya
-
రోప్ లేకుండా రిస్కీ ఫైట్స్
ప్రముఖ యోగా గురువు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా, వైశాలి, కిమయా హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం ‘దివ్యమణి’. మోహ్ మాయా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జులై 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథనానికి స్టైలిష్ స్క్రీన్‌ప్లే జోడించి తెరకెక్కించాం. బ్యాంకాక్, పటాయా వంటి ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్యారలెల్ కిక్ మరియు నాన్ చాక్‌తో టేబుల్ టెన్నిస్ ఆడడం, రన్నింగ్ లారీ కింద నుంచి స్లయిడ్ అవ్వడం వంటి స్టంట్స్‌ను రోప్ లేకుండా రామ్–లక్ష్మణ్‌ల నేతృత్వంలో చిత్రీకరించాం. జాకీచాన్, టోనీజా వంటి యాక్షన్ హీరోలతో పనిచేసిన ఫైట్ మాస్టర్ జైకాకేషా మా చిత్రానికి ఫైట్స్ అందించారు’’ అన్నారు. -
వెండితెరకు యామిని కృష్ణమూర్తి జీవితం
ప్రముఖ యోగా గురువు, మార్షల్ ఆర్టిస్ట్ సురేష్ కమల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దివ్య మణి’. వైశాలి, కిమయా కథానాయికలు. మోహ్ మాయా ఎంటర్టైన్మెంట్స్, రెడ్ నోడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. గిరిధర్ గోపాల్–స్టీవ్ శ్రీధర్ స్వరపరచిన ఈ సినిమా పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. లెజెండరీ డ్యాన్సర్, పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డ్‌ల గ్రహీత డా. యామిని కృష్ణమూర్తి పాటల సీడీలను విడుదల చేసారు. సురేష్ కమల్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ఇది నా తొలి చిత్రం. యోగా నేర్పటం కోసం నేను ప్రపంచమంతా తిరిగినా తెలుగు నేలంటే చాలా ఇష్టం. గిరిధర్ గారు మంచి కథ చెప్పారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశా. ఈ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘మనిషి తనని తాను జాగృతి పరచుకోవటానికి సృజనాత్మకత ఎంతో అవసరం. పాటలు బాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా తర్వాత యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తీస్తాం’’ అన్నారు గిరిధర్ గోపాల్. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటుడు సాయికుమార్, మాటల రచయిత బలభద్రపాత్రుని రమణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ కాటా, నేపథ్య సంగీతం: స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్. -
‘మ్యూజిక్ మ్యాజిక్’ పాటలు
‘‘మన క్లాసిక్ సంగీతానికి రాక్ మ్యూజిక్‌ని మిక్స్ చేసి క్లాసిక్ రాక్ సంగీతంతో ఈ సినిమా చేశాం. కొత్త నటీనటులందరూ బాగా నటించారు. ఆరు నెలలు కష్టపడ్డాం’’ అని దర్శకుడు మంత్రాక్షర్ డీఎస్ చెప్పారు. సోహెల్, త్రినాథ్, కిమాయ, ఇర్ఫాన్ ముఖ్యతారలుగా పాల్రెడ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘మ్యూజిక్ మ్యాజిక్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆండ్రూ విడుదల చేసి, తొలిప్రతిని శ్రీకాంత్‌రెడ్డికి అందించారు. ఈ చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా విష్ణు, సీహెచ్ కిరణ్, సందీప్‌కిషన్, దామోదర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.