సురేష్ కమల్
ప్రముఖ యోగా గురువు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా, వైశాలి, కిమయా హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం ‘దివ్యమణి’. మోహ్ మాయా ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జులై 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథనానికి స్టైలిష్ స్క్రీన్‌ప్లే జోడించి తెరకెక్కించాం. బ్యాంకాక్, పటాయా వంటి ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్యారలెల్ కిక్ మరియు నాన్ చాక్‌తో టేబుల్ టెన్నిస్ ఆడడం, రన్నింగ్ లారీ కింద నుంచి స్లయిడ్ అవ్వడం వంటి స్టంట్స్‌ను రోప్ లేకుండా రామ్–లక్ష్మణ్‌ల నేతృత్వంలో చిత్రీకరించాం. జాకీచాన్, టోనీజా వంటి యాక్షన్ హీరోలతో పనిచేసిన ఫైట్ మాస్టర్ జైకాకేషా మా చిత్రానికి ఫైట్స్ అందించారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment