వైశాలికి రెండు స్వర్ణాలు | Vaishali gets Two Gold Medals | Sakshi
Sakshi News home page

వైశాలికి రెండు స్వర్ణాలు

Published Tue, Jan 29 2019 10:45 AM | Last Updated on Tue, Jan 29 2019 10:45 AM

Vaishali gets Two Gold Medals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో విద్యా వినయలయ స్కూల్‌ విద్యార్థి వైశాలి అద్భుత ప్రదర్శన కనబరిచింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వైశాలి రెండు స్వర్ణాలను గెలుచుకుంది. అండర్‌–16 బాలికల ఫ్లోర్, బీమ్‌ ఈవెంట్‌లలో వైశాలి విజేతగా నిలిచింది. ఫ్లోర్, బీమ్‌ ఈవెంట్‌లలో ఆమని (చిరెక్‌), ఆశ్రిత (సుచిత్ర అకాడమీ) వరుసగా రజత, కాంస్యాలను గెలుచుకున్నారు. వాల్ట్‌ కేటగిరీలో ఆమని పసిడిని కైవసం చేసుకోగా, జీవీ ఆశ్రిత రజతాన్ని గెలుచుకుంది. ఎం. ధన్యతా రెడ్డి (గాడియం స్కూల్‌), పి. వైశాలి కాంస్యాలను అందుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం కార్యదర్శి ఎస్‌. సోమేశ్వర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీబీఆర్‌ పాలక అధికారి జి. రవీందర్, మాజీ కార్యదర్శి ఎం. బాలరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి బి. బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  


ఇతర వయో విభాగాల విజేతల వివరాలు 


అండర్‌–6 బాలికలు: 1. వైష్ణవి (హోవర్డ్‌), 2. జనని (క్రెమన్‌ మాంటిస్సోరి), ఆర్యరావు (బిర్లా ఓపెన్‌ మైండ్స్‌).  
అండర్‌–8 బాలికల ఫ్లోర్‌ ఈవెంట్‌: 1. అనయ (ఇండస్‌), 2. అనన్య (పుల్లెల గోపీచంద్‌ అకాడమీ), 3. ఇషా (ఫ్యూచర్‌ కిడ్స్‌); బాలురు: 1. కృష్ణ (శ్రీహనుమాన్‌ వ్యాయామశాల), 2. అహాన్‌ (చిరెక్‌), 3. ఆకాశ్‌ (సుజాత స్కూల్‌). 


అండర్‌–10 బాలికల బీమ్‌ ఈవెంట్‌: 1. సిరిరెడ్డి (రోజరీ కాన్వెంట్‌), 2. నిధి (నాసర్‌ స్కూల్‌), 3. తన్వి (ఓక్రిడ్జ్‌).  


అండర్‌–10 బాలికల ఫ్లోర్‌ ఈవెంట్‌: 1. సిరి రెడ్డి (రోజరీ కాన్వెంట్‌), 2. మెహర్‌ (పుల్లెల గోపీచంద్‌), 3. నిధి (నాసర్‌ స్కూల్‌); బాలురు: 1. శ్రీకర్‌ (బ్రాహ్మణ్‌ టాలెంట్‌ స్కూల్‌), 2. కె. సాయి కిరణ్‌ (బల్విన్‌ హైస్కూల్‌), 3. శ్రీకర్‌ కుమార్‌ (ఓబుల్‌ రెడ్డి స్కూల్‌). 


అండర్‌–10 బాలుర వాల్ట్‌: 1. శ్రీకర్‌ (బ్రాహ్మణ్‌ టాలెంట్‌ స్కూల్‌), వివియానా అగర్వాల్‌ (చిరెక్‌), 3. కె. మోనిశ్‌ (సెయింట్‌ జోసెఫ్‌).  


అండర్‌–12 బాలికల ఫ్లోర్‌ ఈవెంట్‌: 1. ప్రణవి భారతీయ (డీపీఎస్‌), 2. వేద (చిరెక్‌), 3. క్రుతిక (గాడియం స్కూల్‌); వాల్ట్‌ ఈవెంట్‌: 1. దివేషి (చిరెక్‌), 2. క్షేత్ర (ఇండస్‌), 3. రేహా రెడ్డి (రాక్‌వెల్‌ స్కూల్‌); బీమ్‌: 1. హర్షిత (ప్రభుత్వ పాఠశాల), 2. విష్ణుప్రియ (సెయింట్‌ జోసెఫ్‌), 3. ప్రణవి (డీపీఎస్‌). 


అండర్‌–12 బాలుర ఫ్లోర్‌ ఈవెంట్‌: 1. సాయి అనీశ్‌ (గేట్‌వే ఇంటర్నేషనల్‌ స్కూల్‌), 2. సంతోష్‌ గౌడ్‌ (సెయింట్‌ మేరీస్‌), 3. గౌరీశంకర్‌ (హెచ్‌పీఎస్‌).  


అండర్‌–14 బాలికల ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌: 1. సీహెచ్‌ గీతా రాజ్, 2. అభిష్ట, 3. ఉన్నతి; బీమ్‌: 1. గీతా రాజ్‌ (సెయింట్‌ ఆండ్రూస్‌), 2. అభిష్ట (ఫ్యూచర్‌ కిడ్స్‌), 3. ఉన్నతి (ప్రభుత్వ బాలికల పాఠశాల);  
అండర్‌–14 బాలుర ఫ్లోర్‌: 1. దీపక్‌ గౌడ్‌ (సెయింట్‌ మేరీస్‌), 2. ఆదిత్య (కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌). 3. రాఘవ్‌ (రాకెల్‌ఫోర్డ్‌).  


అండర్‌–18 బాలుర ఫ్లోర్‌: 1. రిత్విక్‌ మిశ్రా (గుడ్‌విల్‌), 2. పవన్‌ లాల్‌ (శ్రీమేధ), 3. బాలాజీ (శ్రీ సాయిరాం స్కూల్‌); వాల్ట్‌: 1. పీతాంబర్‌ (శ్రీమేధ), 2. రిత్విక్‌ మిశ్రా (గుడ్‌విల్‌), 3. బాలాజి (శ్రీ సాయిరాం).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement