
ఆసియా చెస్‌లో వైశాలికి స్వర్ణం
ఆసియా సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల బ్లిట్జ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణులు మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో తమిళనాడు అమ్మాయి
చెంగ్డూ (చైనా): ఆసియా సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల బ్లిట్జ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణులు మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో తమిళనాడు అమ్మాయి ఆర్.వైశాలి స్వర్ణ పతకం సాధించగా... ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత వైశాలి ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... పద్మిని రౌత్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లు సంపాదించిన సారాసదత్ (ఇరాన్) రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఓపెన్ కేటగిరీలో భారత ప్లేయర్ అరవింద్ చిదంబరం ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు 6.5 పాయింట్లతో ఏడో స్థానంతో సంతృప్తి పడ్డాడు.