
రూపాయి పరుగుకు బ్రేక్
ముంబై: వరుసగా రెండు వారాలు బలపడిన రూపాయి మంగళవారం నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్(ఫారెక్స్) మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ 25 పైసలు బలహీనపడి రూ.66.46 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యం... బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఏర్పడిన డిమాండ్ రూపాయి తాజా బలహీనతకు కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. గడచిన రెండు వారాల్లో రూపాయి 50 పైసలు (0.75 శాతం) లాభపడింది.