ప్రోటీస్ జట్టుతో మొదటి టెస్ట్ ఘోర పరాజయం తర్వాత టీమిండియా టీం వైఫల్యంపై విశ్లేషణలు, విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా గతంలో సఫారీ గడ్డపై రాణించిన అజింక్య రహానేను పక్కనబెట్టి స్థానంలో రోహిత్ శర్మను తీసుకోవటం అన్న అంశం మీదే అవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. పేస్ మైదానంపై చెలరేగిపోయే రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతి కష్టం మీద 21 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో రోహిత్‌ను అనవసరంగా ఎంపిక చేశారంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఆ నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. రోహిత్‌ను ఎంపిక చేయటానికి కారణాలు వివరించాడు.
‘‘తాను ఆడిన చివరి మూడు టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ బాగానే స్కోర్ చేశాడు. శ్రీలంక సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుత ఫామ్ ఆధారంగానే మేం అతన్ని తుది జట్టులోకి తీసుకున్నాం. ఓ జట్టుకు అదే కీలకం కూడా. విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు బాగా ప్రాక్టీస్ చేసింది. కానీ, విఫలం అయ్యాం’’ అని కోహ్లి వివరించాడు. మరో వైపు సౌతాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ కూడా భారత జట్టులో బుమ్రా, రోహిత్ శర్మల ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment