
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో ఈసారైనా టైటిల్ సొంతం చేసుకోవాలని ఆశించిన భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 21–12, 15–21, 13–21తో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 68 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడినా... రెండో గేమ్ నుంచి తడబడింది. అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment