మెల్‌బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, 10 సార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్ ధాటికి జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు.
శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో సినెర్ 3 గంటల 22 నిమిషాల్లో 6–1, 6–2, 6–7 (6/8), 6–4తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జొకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన సినెర్ తొమ్మిది ఏస్‌లు సంధించి, 31 విన్నర్స్ కొట్టాడు. జొకోవిచ్ సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు.
మరోవైపు జొకోవిచ్ 54 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో సినెర్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మెద్వెదెవ్ 4 గంటల 18 నిమిషాల్లో 5–7, 3–6, 7–6 (7/4), 7–6 (7/5), 6–3తో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై అద్భుత విజయం సాధించి ఈ టోరీ్నలో మూడోసారి, ఓవరాల్‌గా ఆరోసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment