లండన్: లాక్‌డౌన్ సమయంలో ఇతర క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చాలెంజ్‌లు విసురుకుంటుంటే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం కనిపించకుండా పోయిన వన్డే ప్రపంచకప్ పతకాన్ని వెతికే పనిలో పడ్డాడు. వారం రోజులుగా ఇంట్లో అణువణువూ వెతికానని అయినా తన ప్రపంచకప్ పతకం దొరకలేదని అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఆర్చర్ తన పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి చేరాడు. తాను పాత ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిత్రపటానికి పతకాన్ని వేలాడదీశానని... అయితే కొత్త ఇంటిలో ఆ చిత్ర పటం ఉంది కానీ తన మెడల్ మాత్రం లేదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment