సెమీస్‌లో శ్రీకాంత్‌ పరాజయం   | Srikanth defeat in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీకాంత్‌ పరాజయం  

Published Mon, Mar 25 2024 1:34 AM | Last Updated on Mon, Mar 25 2024 1:34 AM

Srikanth defeat in the semis - Sakshi

స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ కిడాంబి  శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. బాసెల్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ 65 నిమిషాల్లో 21–15, 9–21, 18–21తో లిన్‌ చున్‌ యి (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు.

16 నెలల తర్వాత ఓ టోర్నీలో శ్రీకాంత్‌ సెమీఫైనల్‌ చేరడం గమనార్హం. సెమీఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4900 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement