వజ్రకరూరు: కమలపాడు గ్రామంలో మంగళవారం రాత్రి కు రిసిన భారీ వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలా లు కోతకు గురికావడంతోపాటు పైపొలాల్లోని మట్టి మొత్తం కింది పొలాల్లోకి చేరుకోవడంతో పంటలన్నీ పూడుకుపోయాయి. పంచాయతీ పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మొలకెత్తిన విత్తనాలన్నీ కొట్టుకుపోయాయని వారు వాపోయారు. మిరప, కంది, పత్తి పం టల్లో కూడా వర్షపునీరు నిలబడటంతో పంటలు దెబ్బతి న్నాయి. అదే విధంగా మండలంలోని వజ్రకరూరు, బోడిసానిపల్లి గ్రామాల్లో కూడా భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.
భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు
Published Wed, Jul 27 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement
Advertisement