పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌.. | Sumit Nagal Loses In Geneva Open ATP-250 Tennis Tournament | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌..

Published Mon, May 20 2024 9:15 AM | Last Updated on Mon, May 20 2024 9:15 AM

Sumit Nagal Loses In Geneva Open ATP-250 Tennis Tournament

జెనీవా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 93వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–7 (7/9), 3–6తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ సెబాస్టియన్‌ బేజ్‌ (అర్జెంటీనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

ఒక గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ తన సర్వీను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశాడు. సుమిత్‌కు 6,215 యూరోల (రూ. 5 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.

ఇవి చదవండి: వర్షంతో కోల్‌కతా, రాజస్తాన్‌ మ్యాచ్‌ రద్దు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement