భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ ఐదు స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్‌లో నిలిచాడు.
1973లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్న మూడో భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. తొలి రెండు స్థానాల్లో విజయ్ అమృత్‌రాజ్ (1980లో 18వ ర్యాంక్), సోమ్‌దేవ్ వర్మ (2011లో 62వ ర్యాంక్) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment