పారిస్: భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్‌లో ప్రపంచ 68వ ర్యాంకర్ ముటెట్ కొరెన్‌టిన్ (ఫ్రాన్స్)తో తలపడతాడు. ముఖాముఖి రికార్డులో వీరిద్దరు 2–2తో సమంగా ఉన్నారు. ఒకవేళ తొలి రౌండ్‌లో సుమిత్ గెలిస్తే రెండో రౌండ్‌లో ప్రపంచ 6వ ర్యాంకర్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో ఆడాల్సి ఉంటుంది.
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే రెండో రౌండ్‌లో ముఖాముఖిగా తలపడతారు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీకి కూడా కఠినమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్‌లో ఫాబియన్ రెబూల్–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)లతో బోపన్న–బాలాజీ తలపడతారు. 44 ఏళ్ల బోపన్న వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment