ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం తడబడ్డాడు. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సుమిత్ శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 2–6, 6–2, 5–7తో ప్రపంచ 68వ ర్యాంకర్ కొరెన్‌టీన్ మౌటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ 36 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 38 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment